The South9
The news is by your side.

దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.

post top

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24 గంటల్లో నాలుగు లక్షల ఒక వెయ్యి 911 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో నమోదైన కేసులు సంఖ్య ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యగా నిలబడ్డాయి.                                                                                                                                      గత తొమ్మిది రోజుల్లో రోజువారి కేసులు లక్షకు పైగా పెరిగాయి. దేశంలో ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు అవ్వడం అనేది ఆందోళన కలిగించే అంశం. ఈ విధమైన పెరుగుదల మరో ఐదు రోజుల పాటు ఉంటుందని నిపుణులు అంటున్నారు.                                                                                                                      దేశంలో కేసులు పెరుగుదల చూసుకుంటే పది రాష్ట్రాల లోని 77 శాతానికి మరణాలు సంభవిస్తున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం మేరకు మహారాష్ట్రలో ప్రతి గంటకి 32 మంది కరోనా కాటుకు బలవుతున్నారని, అదే మాదిరిగా ఢిల్లీలో ప్రతి గంటకి 16 మంది చొప్పున కరోనాతో మరణిస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.