జెరూసలేం : ఇజ్రాయిల్ లో యూదులు పవిత్రంగా భావించే మౌంట్ మెలోన్ వద్ద తొక్కిసలాట లో 45 మంది మృతి చెందారు అని, 150కి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. యూదులు ఆ కొండ వద్ద లాగ్ బొమేర్ అనే పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండగ సందర్భంగా ప్రార్థనలు , నృత్యాలు, చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ కార్యక్రమంలో లక్ష మంది పాల్గొనగా మెట్ల పై కూర్చున్న కొంతమంది జారి పడ్డారు అని, అలా ఒకరి పై ఒకరు పడడంతో ఊపిరి ఆడక కొందరు, గాయాలపాలై మరికొందరు మరణించారని తెలిపారు. కరోనా వెలుగు లోకి వచ్చిన తర్వాత మొదటి పెద్ద పండుగ కాబట్టి అధిక సంఖ్యలో భారీగా ప్రజలు చేరుకున్నారని అక్కడ అధికారులు తెలిపారు.
Comments are closed.