The South9
The news is by your side.

ట్రంప్ తెచ్చిన తంటా

post top

south 9 ప్రతినిధి

after image

అమెరికా అధ్యక్షునికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే ట్రంప్ గెలవడంతో అమెరికాలో చాలామంది కెనడాలోకి వెళ్లిపోయే ప్లాన్లో ఉన్నారట అమెరికాలో ట్రంప్ గెలుపు తమ దేశంలోకి వ‌ల‌స‌ల‌ను పెంచుతుందని కెనడా అధికార వర్గాలు చెబుతున్నాయి అందుకే ఎన్నికల ఫలితాలు రోజు నుంచి సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేశామని వివరించారు బోర్డర్లో సైనికులు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని వివరించారు కెనడా అమెరికా సరిహద్దును నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు గతంలో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలోనూ అమెరికా నుంచి కెన‌డాలోకి భారీగా వ‌ల‌స‌లు చోటుచేసుకున్నాయని కెనడా అధికారులు చెప్పారు తాజాగా ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేప‌ట్ట‌నుండ‌టంతో మరోసారి వలసలు పెరుగుతాయేమో అని ఆందోళన వ్యక్తం చేశారు గూగుల్లో కెనడా ఇమిగ్రేషన్ కెన‌డాలోకి ఎలా వెళ్లాలి అనధికారికంగా వెళ్లడానికి మంచి లోకేషన్ ఏది? అంటూ వివరాలు ఆరాతీస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అయితే త‌మ‌ దేశంలో అక్ర‌మంగా అడుగు పెట్టడం అంత సులభం కాదని కెన‌డా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు సిబ్బంది దృష్టి మొత్తం బోర్డ‌ర్‌ పైనే ఉంది సరిహద్దుల్లో కెమెరాలు సెన్సార్లు డ్రోన్లను మోహ‌రించారు. దేశంలోని వ‌ల‌స‌ల సంఖ్యను కూడా తగ్గించాలని ట్రూడో సర్కార్ నిర్ణయించింది

ట్రంప్ తెచ్చిన తంటా

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.