The South9
The news is by your side.

దావోస్‌ పర్యటనలో భాగంగా జురిచ్ చేరిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్

post top

 

19–05–2022
అమరావతి.

after image
  • *దావోస్‌ పర్యటనలో భాగంగా జురిచ్ చేరిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్*

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జురిచ్ చేరుకున్నారు. దావోస్ పర్యటన కోసం ఆయన గురువారం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలను ప్రపంచస్థాయి వేదికగా వినిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పాల్గొననున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, అధికారుల బృందం జురిచ్ చేరుకున్నారు. అక్కడ నుంచి దావోస్ చేరుకుంటారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెంట ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ , తదితరులు ఉన్నారు.

——-

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.