
ఢిల్లీ ప్రతినిధి : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని విస్తృత ప్రచారం జరిగింది, కానీ తన కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపై రాజకీయ విశ్లేషకుల తోపాటు, పలు రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ ఆంతరంగిక చర్చల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేదానికి సుముఖంగా లేదని తెలియడంతో, తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే పార్టీని బలోపేతం చేసేందుకు పని చేయడం కష్టమని తెలిపినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పలు దఫాలు చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం, ప్రశాంత్ కిశోర్ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానం సొంత రాష్ట్రమైన బీహార్ నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలుగా ప్రజల కొరకు వివిధ రాజకీయ పార్టీలతో కలిసి పని చేశానని ఇప్పుడు మరింత చేరువఅవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.




Comments are closed.