The South9
The news is by your side.

తన రాజకీయ భవిష్యత్తుపై ఢిల్లీ పయనమైన ఈటెల రాజేందర్

post top

తెలంగాణ ప్రతినిధి:                                                                                                                           తెలంగాణ మాజీ మంత్రి , ఈటెల రాజేందర్ తన మంత్రి పదవి కోల్పోయిన తర్వాత రాజకీయ అడుగులు వేగంగా వేస్తున్నాడు అనుకోవాలి. తెరాస అగ్రనాయకత్వం తో విభేదాలు నడుమ పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పదునైన విమర్శలు గుప్పించడం తో ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తు పై ఒక నిర్ణయానికి వచ్చాడు అని మీడియాలో వివిధ రకాల ప్రచారాలు ఊపందుకున్నాయి.               ‌                              ‌‌‌‌‌‌‌‌‌                                            బీసీ నేతగా ఉన్న ఈటెల సొంత కుంపటి పెడతారు అని ప్రచారం జరిగినా దాని ఫలితం అంత ఆశాజనకంగా ఉండబోదని గ్రహించి, వేరే పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈటెల రాజేందర్ ఢిల్లీ పయనమయ్యారు. రాజేందర్ తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, బిజెపి నాయకుడు వివేక్ ఉన్నారు. రేపు బిజెపి ముఖ్యనేతలతో సమావేశం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది.                                                                                              అందువల్లనే ఈరోజు ఢిల్లీ పయనమైట్లు తెలుస్తుంది. రేపు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తోపాటు కీలకమైన నేతలను కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో తెరాసను ఎదుర్కోవాలంటే బిజెపి నే బలమైన శక్తి అని ఈటెల రాజేందర్ భావించినట్లు తన సన్నిహిత వర్గాల తో అన్నట్లు సమాచారం.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.