
సినీ బ్యూరో : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు , సాధారణ ఎన్నికలు రీతిలో మీడియా పబ్లిసిటీ ఇవ్వడంతో ప్రజలు కూడా ఆసక్తిగా గమనించారు. రెండు ప్యానల్ లు పోటీలో నిలవుగా మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం వారి సభ్యులు రాజీనామా చేయడం వల్ల వ్యవహారం ఇంకా నలుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్ సీసీ పుటేజ్ ఇవ్వాలని కోరడంతో పాటు, మా ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి చెందిన కార్యకర్త నూకల సాంబశివరావు ని అనుమతించారని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రశ్నించారు. అలానే వైసీపీ కార్యకర్త సాంబశివరావు లోపల ఓటర్లను బెదిరించారని చర్యలు తీసుకోవాలని అన్నారు. సాంబశివరావు మంచు విష్ణు తో ఉన్న ఫోటోలు కృష్ణమోహన్ కి పంపించారు.

ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. దీనిపై కృష్ణమోహన్ ఎన్నికల బాధ్యత ముగిసిన తర్వాత ఇక తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు కి వైయస్సార్ సిపి సహకరించిందని ప్రకాష్ రాజ్ ఆరోపించడంతో మరో చర్చకు దారి తీసింది



Comments are closed.