The South9
The news is by your side.

కేశినేని టిడిపి లోనేనా?

అమరావతి: గత కొన్ని రోజులుగా టిడిపి కి దూరంగా ఉంటున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మంగళగిరి లో జరిగిన చంద్రబాబు దీక్షకు మద్దతు గా వెళ్లడం జరిగింది . ఈ నేపథ్యంలో ఈ మధ్యనే కేశినేని కార్యాలయంలో చంద్రబాబు ఫోటో తొలగించి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ఫోటో పెట్టడం తో కేసినేని నాని టీడీపీకి దూరం కాబోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే వెంటనే స్థానిక మైనార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ ఊహాజనితమైన వార్తలని కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన చంద్రబాబు నిరసన కార్యక్రమానికి కేశినేని నాని పాల్గొనడం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం తో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. కేశినేని నాని సభా ప్రాంగణానికి చేరుకోగానే చంద్రబాబు చెవిలో గుసగుసలు మాట్లాడిన తర్వాత ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న చంద్రబాబు బస్సులో కి వెళ్లడం తదుపరి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేయడంతో చంద్రబాబు బలమైన హామీ కేశినేని నానికి ఇచ్చారని తెలుగుదేశం వర్గాల్లో చర్చ గా మారింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతారని అంటున్నారు

Post midle

Leave A Reply

Your email address will not be published.