చెన్నై ప్రతినిధి : దేశంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడులో కేసులు పెరుగుదల ఎక్కువగా ఉన్నందున లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం విధితమే. అయితే కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తనవంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈరోజు రజినీకాంత్ ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసి చెక్కును అందజేశారు.


తదనంతరం మీడియాతో మాట్లాడుతూ తనవంతుగా కోవిడ్ నియంత్రణకి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించానని అని తెలియజేశారు. ఈ విపత్కర సమయంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అలాగే కొత్త ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కొన్ని రోజుల క్రితం తమిళ హీరో సూర్య తనవంతుగా కోవిడ్ నియంత్రణకు కోటి రూపాయలు విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించిన సంగతి తెలిసిందే.



Comments are closed.