The South9
The news is by your side.

వై.వి వైపే వైయస్ జగన్ మొగ్గు?

post top

అమరావతి:                                                            తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మార్పు జరుగుతుంది అనుకుంటున్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇదే చివరి సమావేశం అని చైర్మన్ మార్పు ఉంటుందని అందరూ అనుకుంటున్న వేళ వై వి సుబ్బారెడ్డి నే మరొక సంవత్సరం కొనసాగించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. వై వి సుబ్బారెడ్డి మంత్రివర్గంలో కి రావాలని చూస్తున్నారని, ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అలాంటి మార్పులకు వైయస్ జగన్ సుముఖంగా లేడని తెలుస్తోంది. మంత్రివర్గ మార్పుచేర్పులు కూడా ఇంకా సమయం ఉందని ఇప్పుడు టిటిడి చైర్మన్ మార్పు జరిగితే ఎవరు ఊహాగానాలు వారు చేసుకునే అవకాశం ఉన్నందున మరొక సంవత్సరం వై.వి సుబ్బారెడ్డి వైపే వైయస్ జగన్ మొగ్గుచూపుతున్నారని అమరావతి వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.