సినీబ్యూరో: కన్నడ అనువాద చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం కే జి .ఎఫ్. ఒక్క సినిమాతోనే కే జి ఎఫ్ లో హీరో గా నటించిన యష్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. అలానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ వైపు బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు అంటే కేజిఎఫ్ మానియా ఎలా ఉందో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం కే జి ఎఫ్ కి కొనసాగింపుగా కే జి ఎఫ్ చాప్టర్ టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా అదిరా పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్తు ని తీసుకున్న సంగతి తెలిసిందే , ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా అదిరా పాత్రధారి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. దీనికి సంబంధించిన పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ…. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ చిత్ర విడుదల కోసం మీరందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఇది వేచి ఉండడానికి విలువైనదని మీకు భరోసా ఇస్తున్నా.. అంటూ చాలా కాలం తర్వాత తను నటిస్తున్న చిత్రం చూడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు సంజయ్ దత్.




Comments are closed.