ఎప్పుడు ఏదో ఒక వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే వ్యక్తి దర్శకుడు రాంగోపాల్ వర్మ. తను చేసే ప్రతి పనిలో ఏదో ఒక రీతిలో వార్తల్లో ఉండాలనుకుంటారు. తాజాగా చిరంజీవి జన్మదిన సందర్భంగా జరిగిన వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొనకపోవడం పై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో, అల్లు అర్జున్ రియల్ మెగాస్టార్ అని, మిగతా మెగా హీరోలు అందరూ పరాన్నజీవులను ట్వీట్ చేసి వివాదం రేపారు. దీనికి సంబంధించి ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ… తన ట్వీట్ చేసింది కరెక్టే అని మిగతా మెగా హీరోలు చెప్పిందే తను ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తనతో ఇంటర్వ్యూ చేసిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ…. ఈ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత అషు రెడ్డి ఫ్యాన్ అయ్యానని, నేను కలిసిన వారిలో నిజాయితీ అమ్మాయిని, ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.




Comments are closed.