ఇడుపులపాయ : గత కొన్ని రోజులుగా వైయస్సార్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దృశ్యం నేటితో తెరపడింది. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులంతా పాల్గొని ప్రార్థనలు చేశారు. గత జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్, వారి చెల్లెలు వైయస్ షర్మిల, వేరువేరుగా వచ్చి నివాళులర్పించిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి వైయస్ షర్మిల, వేరువేరుగా వస్తారా లేక కలిసి వస్తారా అని వైయస్సార్ అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూశారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థన లో పాల్గొనడం విశేషం. దీంతో వారి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అని అనుకోవాలి. అలానే నేడు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో వైయస్సార్ తో కలిసి ప్రయాణం చేసిన సహచరులతో ఆత్మీయ సమ్మేళనం హైటెక్స్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కొంతమంది రాష్ట్ర ప్రముఖులు కి ,మంత్రులకి ఆహ్వానం అందినట్టు సమాచారం. అయితే ఎవరెవరు పాల్గొంటారు అనేది వేచి చూడాలి. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తనకున్న ప్రేమను భావోద్వేగమైన ట్వీట్ తో పంచుకున్నారు.




Comments are closed.