The South9
The news is by your side.

ఆంధ్రాలో RRR పరిస్థితి ఏంటి?

post top

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ,హీరోలగాడి. వి .వి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR చిత్రానికి సంబంధించి న ట్రైలర్ ఈవెంట్ ముంబైలో జరగగా ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలుగు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత దానయ్య మాట్లాడుతూ , ఏపీలో టికెట్ ధరల గురించి వ్యాఖ్యానిస్తూ తమ సినిమా స్థాయికి ఏపీలో టికెట్ ధరలు సరిపోవు అంటూ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారని మనకి తెలిసిందే. DVV దానయ్య  RRR గురించి చర్చిస్తూ ఏపీ ప్రభుత్వం తమ సినిమా టికెట్ ధరల గురించి మరోసారి పునరఆలోచిస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు.కథానాయకుడు ఎన్టీఆర్ కి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ  గతంలో సన్నిహితులు అయినప్పటికీ ఈ విషయంలో ఎంతవరకు సహాయపడతారు అనేది ప్రశ్నార్థకమే. ఇటీవల విడుదలైన భారీ విజయం సాధించిన అఖండ ఏపీ కలెక్షన్స్ గురించిడిస్ట్రిబ్యూటర్లు చర్చిస్తూ టికెట్ ధరలు తక్కువగా ఉండడం వల్ల తమకు అనుకున్నంత కలెక్షన్లురా లేదని బాధపడ్డారు.    ఏపీ ప్రభుత్వం ఈ టిక్కెట్ల ధరల విషయంలో  ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అనేది వేచి చూడాల్సిందే.

after image

Sabavath Meenakshi

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.