The South9
The news is by your side.

పుష్ప పాట పై వివాదం.

post top

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ అల్లు అర్జున్ అభిమానులనే కాకుండా సినీ అభిమానులను అలరిస్తూ ఉంది. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే చిత్రంలో ఐటమ్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఐటమ్ సాంగ్ లో సమంత నటించడం విశేషం.” ఊ అంటావా ఊహు అంటావా”అని ఈ పాట ప్రస్తుతం మాస్ ఆడియెన్స్ ను అలరిస్తూ ఉంది. ఈ చిత్రానికి చంద్ర బోస్ సాహిత్యాన్ని అందించడం జరిగింది. అయితే ఈ పాటలోని లిరిక్స్ మగవాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఒక ప్రైవేటు సంస్థ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ పాటని నిషేధించాలని కోర్టును కోరింది.17 తారీకు చిత్రం రిలీజ్ ఉండగా ఇప్పుడు ఈ అంశం వివాదం అయింది. అయితే దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేదు

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.