The South9
The news is by your side.

అతడు ఆమె ప్రియుడు” ప్రచారచిత్రం ఆవిష్కరించిన దర్శకసంచలనం వి.వి.వినాయక్!

post top

యండమూరి వీరేంద్రనాధ్
“అతడు ఆమె ప్రియుడు”
ప్రచారచిత్రం ఆవిష్కరించిన
దర్శకసంచలనం వి.వి.వినాయక్!!

after image

ప్రఖ్యాత రచయిత
యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా
దర్శకత్వం వహిచిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.
సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది.
త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకసంచలనం వి.వి.వినాయక్ విడుదల చేసి, ట్రైలర్ అద్భుతంగా ఉందని… సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన “అతడు ఆమె ప్రియుడు” అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు.
అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.