The South9
The news is by your side.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

post top

 

తేదీ: 22-01-2022,
అమరావతి.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

after image

*ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేసుకొని, జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి మేకపాటి*

అమరావతి, జనవరి, 22; ఐ.టీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా లక్షణాలు గమనించి ఆయన కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా తప్పకుండా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.

——-

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.