
- యదేచ్ఛగా కోళ్ళ వ్యర్థాలు అక్రమ రవాణా
- నిఘా ఉంచిన మత్స్యశాఖ అధికారులు
- పోలీసులు కూడా దృష్టి సారించాలి నెల్లూరు క్రైమ్ ప్రతినిధి: చిత్తూరు జిల్లా నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా కోళ్ల వ్యర్ధాలను నెల్లూరు కి తరలిస్తున్నారు. కోళ్ల మాంసం వ్యాపారంలో మిగిలిన వ్యర్థాలను తొలగించాలి. కానీ ఆ వ్యర్ధాలను చేపల గుంటలు చేసే వ్యాపారులు కొనుగోలు చేయడం, వాటిని చేపల కి ఆహారం వాడడం జరుగుతుంది. ఆ చేపలు తిన్న ప్రజలు జీర్ణ సంబంధించిన వ్యాధులతో పాటు అనేక రోగాలకు గురి అవుతున్నారు. ఈ వ్యర్థాలను తరలించడం నిషేధం. అయితే రాత్రి వేళల్లో అధికారుల కళ్లుగప్పి యదేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంది. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా గూడూరు హైవే మీద కోళ్ల ఈకలను పడ వేస్తున్నారు. మిగతా వ్యర్థాలను దామరమడుగు సమీపంలో చేపల గుంట వ్యాపారులకు చేర వేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి మా ప్రతినిధి గూడూరు మత్స్యశాఖ ఏడి ని సంప్రదించగా ఈ సమాచారం తమకి ఉందని, ఈ మధ్యనే రెండు కేసులు బనాయించామని తెలిపారు. వారిపై నిఘా ఉంచామని అన్నారు. మత్స్యశాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.
![]()




Comments are closed.