The South9
The news is by your side.

ఆర్.ఆర్ ఆర్. సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

post top

 

after image

అమరావతి: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టికెట్‌ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హై బడ్జెట్‌ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు పెంపునకు అనుమతి ఇచ్చింది. దీనిపై రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్‌ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని వెల్లడించారు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.