The South9
The news is by your side.

నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం.

post top

నటుడు, రచయిత అయన ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మృతి చెందారు. ఉత్తేజ్ కి సంబంధించిన కార్యక్రమాలలో ఆమె సహకారం అందించేవారు. వారికి చెందిన వస్త్ర దుకాణ బాధ్యతలు కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్ భార్య మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్లి ఉత్తేజ్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో నటులు చిరంజీవి, ప్రకాష్ రాజ్ జీవిత రాజశేఖర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఉత్తేజ్ కి ‘సౌత్ 9’ తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాము.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.