The South9
The news is by your side.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన అక్కినేని నాగార్జున?

post top

అమరావతి : ప్రముఖ నటుడు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున ఈరోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసినట్లు అమరావతి వర్గాలు పేర్కొన్నాయి? నాగార్జున తో పాటు నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇద్దరు ప్రముఖులుకలిసినట్లు సమాచారం, ‘మా’ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు ప్యానల్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి పరిశ్రమకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇస్తారని, గతంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇంతకు మునుపు మెగా స్టార్ చిరంజీవి తో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన నాగార్జున ఇప్పుడు మాత్రం ఒంటరిగా కలవడం చర్చనీయాంశం అయింది. మా ఎన్నికల ముందు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన తర్వాత చిరంజీవి లేకుండా ,నాగార్జున కలవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీలో ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ తో కలిసి భోజనం చేసినట్లు సమాచారం.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.