The South9
The news is by your side.

సంక్రాంతికి అత్యధికంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ.

post top

అమరావతి   :                                                                                                                                  సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే ప్రతి ఒక్కరు తమ సొంత ఊర్లకి పయనం అవ్వడానికి సిద్ధమవుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా టికెట్ల ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎ.పి.యస్. ఆర్. టి .సి ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యింది.ఈ సంక్రాంతికి 6970 ప్రత్యేక సర్వీసులను నిర్వహించనుంది. ముందుగా 4145 ప్రత్యేక సర్వీసులు, పండగ తర్వాత 2825 సర్వీసులను నడపనుంది. గతంలో కంటే 35 శాతం ఎక్కువగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది.

సంక్రాంతికి ముందు                                                                                                                                            సంక్రాంతికి ముందు అంటే జనవరి 8వ తేదీ నుంచి 14 వరకు 4,145 ప్రత్యేక బస్సులును,  వీటిలో 1,500 బస్‌ సర్వీసులు హైదరాబాద్‌కు , విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. గత ఏడాది సంక్రాంతి ముందు మొత్తం 2,982 ప్రత్యేక బస్సులే ఆర్టీసీ నడిపింది. ఈసారి 1,163 సర్వీసులను అధికంగా కేటాయించింది.

after image

పండగ తర్వాత

పండగ తరువాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుంది. వాటిలో హైదరాబాద్‌కు అత్యధికంగా వెయ్యి బస్సులను కేటాయించారు. విశాఖపట్నానికి 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు  గతేడాది సంక్రాంతి తరువాత 2,151 ప్రత్యేక బస్సులు నిర్వహించారు. ఈ ఏడాది 674 బస్సులను అధికంగా కేటాయించారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.