The South9
The news is by your side.

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

 

*ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు సోమవారం విజయవాడలోని ఏపీ సెక్రటరియేట్ లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణగారిని ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లతో మర్యాదపూర్వకంగా కలిశారు.*

 

*ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం సోమేశ్వరస్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి రూ.23లక్షలు నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మంజూరు చేయించడం పట్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.*

 

after image

*2020లో వచ్చిన భారీ వరదల కారణంగా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన సోమేశ్వరాలయం ధ్వంసం కావడంతో దివంగత మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆలయాన్ని సందర్శించి ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రివర్యులకు విన్నవించిన విషయం విధితమే.*

 

*తదనంతరం జరిగిన పరిణామాల కారణాలతో ఆత్మకూరు శాసనసభ్యులుగా మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఎన్నిక కావడం, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే.*

 

*ఆలయ పునర్నిర్మాణం కోసం అదనపు నిధులు అవసరమని మంత్రివర్యులు కొటటు సత్యనారాయణ గారిని కలిసి విన్నవించి అవసరమైన రూ.7.70 కోట్ల నిధులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.