The South9
The news is by your side.

దివంగత మంత్రి మేకపాటిసంతాప సభలో పాల్గొనేందుకు నెల్లూరు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్

post top

*ముఖ్యమంత్రి పర్యటనకు*
*పకడ్బందీగా ఏర్పాట్లు*

*పర్యవేక్షించిన మంత్రి అనిల్, ఎంపీ వీపీఆర్ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు*

after image

– *వీపిఆర్ కన్వెన్షన్ లో కార్యక్రమం*

*దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 28న నెల్లూరుకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర *జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు కార్పొరేషన్ లోని కనుపర్తిపాడు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సంతాప సభ ఏర్పాట్లను, పరిసర ప్రాంతాలను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావుతో కలిసి మంత్రి పరిశీలించారు.*

*ఈ సందర్భంగా వారు పార్కింగ్, సీటింగ్, భోజన సదుపాయాలు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ పర్యటనలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, ఏఎస్పి వెంకటరత్నం, ఆర్ డి ఓ హుస్సేన్ సాహెబ్, అధికారులు ఉన్నారు.*
……….

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.