
ప్రేమాభిమానులకు చిహ్నం క్రైస్తవం: ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలు
: క్రైస్తవ సోదరులకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే
ప్రేమాభిమానులకు చిహ్నం క్రైస్తవం అని, క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు.
శనివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని రవితేజ కళ్యాణమండపంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రవితేజ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి పాస్టర్లు, మత పెద్దలు, సంఘ కాపర్లు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటివిక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తన బాల్యం ఊటిలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో జరగడం వల్ల ఈ కార్యక్రమం తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసిందని వివరించారు. నియోజకవర్గంలో అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.


రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని 500 సంవత్సరాల పాటు పాలించారని, మన జీసెస్ వచ్చిన తరువాత క్రైస్తవాన్ని అందరికి పరిచయం చేశారని, ప్రస్తుతం ప్రపంచంలో 70 శాతం మంచి క్రైస్తవాన్ని ఆచరిస్తున్నారని వివరించారు.
అప్పటి రోమన్ పాలకుల పాలనలో అకృత్యాలు జరుగుతున్న విషయాలను గమనించిన జీసెస్ మార్పు చేయాలనే సంకల్పంతో తానొక్కడే అందరికి ప్రేమాభిమానులను తెలిచేయడంతో పాటు మంచి పరిపాలన అందించేలా అందరికి బోధనలు చేశారని వివరించారు.
ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు తెలిపిన దైవ సందేశాలను గురించి అందరికి వివరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం విద్యాబోధన, మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడం, పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.
కొంత మంది వ్యక్తులు పదిసార్లు చెప్పి అసత్యాన్ని సత్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, అసత్యాలను ఎవరూ విశ్వసించవద్దని, విశ్వసనీయతకు, సత్యాన్ని పాస్టర్లు ప్రజలందరికి వివరించాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ది చెందేలా పాలన ఎవరు అందిస్తున్నారో వివరించాలని కోరారు.
ఏ నాయకుడు ఏ ఆలోచనతో ప్రజల ముందుకు వస్తున్నాడో ప్రజలకు మీ ద్వారా వివరించాలని సూచించారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, ఆ ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఐదు సంవత్సరాల పాలించే వారిని నిర్ణయించే హక్కు ఓటు కల్పిస్తుందని, నూతన ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత రెండుప్రభుత్వాలు వచ్చాయని, ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందో ప్రజలందరూ తెలుసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారని, ఆ ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు జరిగితే ఎంతో అభివృద్ది జరుగుతుందని, కానీ కోర్టు కేసుల కారణంగా నాలుగు సంవత్సరాలు ఆలస్యమైనా ప్రభుత్వం పోరాడి ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడుతుందని, ఇలాంటి విషయాలన్నింటిని ప్రజలకు వివరించాలని అన్నారు.
కరోనాతో రెండు సంవత్సరాలు బాధపడ్డామన్న విషయాన్ని గుర్తూ చేస్తూ మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.
అనంతరం మత పెద్దలు, పాస్టర్లతో కలసి ఆయన కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి క్రైస్తవ సోదరులు ఆశీర్వాదం అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే వారికి బహుమతులు అందచేయడం జరిగింది. అంతకు ముందు చిన్నారులు ఆలపించిన భక్తిగీతాలు ఆందరిని అలరించాయి.
Comments are closed.