The South9
The news is by your side.
after image

పిల్లల ఉన్నత విద్య కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదన్నదే లక్ష్యం.. సీఎం జగన్

post top

 

తేదీ : 20-12-2023*

*స్థలం : తాడేపల్లి*

*అర్హులైన 390 మంది విద్యార్థులకు, రూ.41.60 కోట్ల ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’*

 

*పిల్లల ఉన్నత విద్య కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదన్నదే లక్ష్యం.. సీఎం జగన్*

 

*సివిల్స్ ప్రిలిమినరీలో అర్హత సాధించిన 95 మందికి లక్ష చొప్పున ఆర్థిక తోడ్పాటు*

 

*గత ప్రభుత్వంలా మొక్కుబడి సాయం కాదు.. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్‌గా ఎదిగేలా సాయం : సీఎం జగన్*

 

 

Post midle

మ‌న విద్యార్థులు పోటీ ప్ర‌పంచంలో లీడ‌ర్స్‌గా ఎద‌గాల‌ని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యార్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా మన ప్రభుత్వంలో ‘జగనన్న విదేశీ విద్య’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని, ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు రూ. 8 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా సీఎం జ‌గ‌న్ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.

Post Inner vinod found

తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. శాచురేషన్‌ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్‌ రేటింగ్, టైమ్స్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 50 కాలేజీల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటైర్‌ ఫీజు కోటి 25 లక్షల దాకా ఇచ్చి తోడుగా నిలబడే కార్యక్రమం ఇదని తెలిపారు.

 

ఈ ఏడాది దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, రూ.9.50 కోట్లు వారికి ఇస్తున్నామని, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్‌లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం రూ.41.59 కోట్లు నేడు ఇస్తున్నామని తెలిపారు. “దాదాపుగా రూ. 107 కోట్లు 408 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తి ఇస్తుందంటే..మిమ్మల్ని చూసి మిగిలిన వారు కూడా ఇన్‌స్ఫైర్‌ అయి టాప్‌ యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకునేలా, మీరు గొప్పగా ఎదిగే దాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రీబ్యూషన్‌ ఇచ్చి రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక” అని సీఎం జగన్ ఆకాంక్షించారు.

 

రూప అనే విద్యార్థినికి రూ.89 లక్షలు, సాంబశివుడికి రూ.89 లక్షలు, కొలంబియా యూనివర్సిటీ న్యూయర్స్‌లో పకీర్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఆయనకు రూ.78 లక్షలు. మరియం రూ.67 లక్షలు ఫీజులు ఉన్నాయని, సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ఈ ఫీజులు ఉన్నాయని, అక్కడికి వెళ్లి చదవాలంటే ఎంత అప్పులు చేయాలని తల్లిదండ్రులు సంశయం చెందుతున్నారని అన్నారు. అటువంటి పరిస్థితులను మార్చుతూ..ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.

 

“వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉన్న కుటుంబాలకు ఈ పథకం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీ అందరికీ కూడా ఆల్‌ దీ బెస్ట్‌ విసెస్‌ తెలియజేస్తూ మీరందరూ అత్యధికంగా బాగుపడాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వారి కుటుంబాలను ఈ స్థాయి నుంచి మరో స్థాయిలోకి తీసుకెళ్లే పరిస్థితి రావాలని, దేవుడు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను” అని సీం అన్నారు

 

*ప్రిలిమ్స్‌ పాసైతే లక్ష రూపాయలు, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర సాయం*

 

మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎన్నికైన వారిని కూడా ప్రోత్సహించేందుకు ఈ రోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రిలీమ్స్‌ పాసైన వారేవరైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహకం, ప్రిలీమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైతే మరో రూ.50 వేలు కలిసి రూ.1.50 ఇస్తామని సీఎం ప్రకటించారు. ఎన్నిసార్లు పరీక్షలు రాసినా కూడా ఈ ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ చదువులను ప్రోత్సహించే కార్యక్రమం మొదలుపెడుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

 

ఈ రెండో కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది విద్యార్థులు ప్రిలీమ్స్‌కు చేరారని, వీరిలో 11 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, వీరికి ఇవాళ ప్రోత్సాహకం అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఎక్కడా కూడా శాచురేషన్, పారదర్శకత అన్నది ప్రజల ముందుర ఉంచుతున్నామని, ఎవరికి రెకమెండేషన్లు అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, మీరు క్వాలిఫై అయి అప్లికేషన్‌ పెట్టుకుంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు.

Post midle

Comments are closed.