
సేవాకర్తలకు జ్ఞాని జైల్ సింగ్ జాతీయ స్మారక పురస్కారాలు
– అందజేసిన ప్రభుత్వ సలహాదారు షరీఫ్
అమరావతి:

దేశ భక్తుడు జ్ఞాని జైల్ సింగ్ అని, అటువంటి మహనీయుల చరిత్రను నేటి యువతరానికి తెలియజేసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ తీసుకోవడం అభినందనీయం అని ప్రభుత్వ సలహాదారు, శాసన మండలి మాజీ చైర్మన్ యం.ఏ షరీఫ్ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలు అందించిన సామాజిక సేవాకర్తలకు, పాత్రికేయులకు భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జాతీయ స్మారక పురస్కారం ( మెమోరియల్ అవార్డు) లను ముఖ్య అతిథిగా విచ్చేసిన షరీఫ్ అందజేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవా స్పూర్తితో ఉండాలన్నారు. ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలువ బడుతున్న పత్రికా వ్యవస్థను ఎంతో గొప్పదన్నారు.
దేశం కోసం, రాష్ట్రం కోసం అత్యుత్తమ సేవలు అందించి ఉన్నత స్థాయిలో ఉన్న వారి జీవితగాధ, త్యాగాలు తెలుసుకోవలసిన అవసరం నేటి తరానికి ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ఈ తరం వారు చాలా వేగవంతంగా ఉంటున్నారని టీవీలో, సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నారే తప్ప,; ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గతంలో మన పూర్వీకులు, పెద్దలు ఏ రకంగా కష్టపడ్డారో తెలుసుకోలేకపోతున్నారని అన్నారు. మనం ఈ స్వేచ్చ గాలులను పిలుస్తున్నామంటే, మాట్లాడే స్వాతంత్ర్యం పొందామంటే, మనం ఓటు హక్కు ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులను ఎన్నుకుంటున్నామంటే, అది ఆషామాషీగా వచ్చిన స్వాతంత్ర్యం కాదన్నారు. ఎంతోమంది తమ విలువైన జీవితాన్ని, యవ్వనాన్ని జైలులో దరపోసారని, ప్రాణాలు సహితం త్యాగం చేశారాన్నారు. ఆ రకంగా అనేక దశాబ్దాలుగా పోరాడిన తరువాత మనకి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కాబట్టి అటువంటి వారి చరిత్రలను నేటి తరానికి చెబితే వారిలో త్యాగనిరతి, దేశాభిమానం పెరుగుతుందన్నారు. అటువంటివారిలో జ్ఞాని జైల్ సింగ్ దేశం కోసం పోరాడినా దేశ భక్తుడిని అన్నారు. ఆయన కోసం తెలియజేసేందుకు ఈనాడు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు యూనియన్, వివిధ స్వచ్ఛంద సంస్థలు పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలు అందించి సామాజిక సేవా కర్తలకు జ్ఞాని జైల్ సింగ్ మోమోరియల్ అవార్డులను అందజేయడం గొప్ప విషయమన్నారు. నేటి తరం ఎక్కువ సమయం ఫోన్ కే కేటాయిస్తున్నారని, విలువైన సమయాన్ని విజ్ఞానానికి, విషయ పరిజ్ఞానానికి వినియోగించాలన్నారు. గురుకుల పాఠశాలలో 5 వ తరగతి నుంచి చదివిన పేద విద్యార్దులు ఎక్కువమంది ఐఐటీ లో ఉత్తీర్ణత సాధిస్తున్నారని అన్నారు. అందుకు కారణం వారికి చదువే తప్ప టీవీ, ఫోన్ అనే ధ్యాస లేకపోవడమే అన్నారు
దేశంలో జరిగిన దురదృష్టకరమైన పరిస్థితులు మూలంగా యుద్ధావతవరణం వచ్చిందన్నారు. శిక్షించవలసిన వారిని శిక్షించడానికి భారతదేశం ప్రభుత్వం కంకనబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. ఎవరైతే ముష్కరులు భారతదేశంలో చొరబడి అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, ఆ ముష్కరులకు కొంతమేరకు గుణపాఠం చెప్పమని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలను భారతదేశ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత భారత దేశంలో ప్రతి పౌరుడు ఎక్కడికైన వెళ్లవచ్చు, ఎక్కడికైనా విహరించే పరిస్థితులు గతంలో ఉండేవని, దుష్ట సంఘటనలు వల్ల ఇపుడు ఆ పరిస్థితులు కనబడకుండా భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. జర్నలిజంలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు సమాజంలో తప్పులు ఎంచుతూ, మంచిని ప్రోత్సహించే విధంగా పనిచేయాలన్నారు. గతంలో తమ మాటలు, కార్యక్రమాలను తర్వాత రోజు వచ్చే దినపత్రికలో ఆతృతగా చూసేవారమని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిమిషాల్లో వార్తలు సామాజిక మాధ్యమాలు ద్వారా చూస్తున్నామని అన్నారు.
సామాజిక మాధ్యమ మీడియాకు ప్రజలు బానిసలు అవుతున్నారని, దానిలో మంచి చెడు చూడకుండానే ప్రతిదీ ఫార్వర్డ్ చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యంతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. యువ జర్నలిస్టులు నైతిక విలువలను కాపాడుకుంటూ జర్నలిజానికి మరింత వన్నె తేవాలని సూచించారు. ప్రత్యేక ఆహ్వానితులు తెదేపా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకచారి, తమిరి శివ ప్రసాద్, కట్టోజు సన్నయ దాసు, బత్తినపాటి చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ప్రసాద్ బాబు, ఏపీఎంవీఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ లు మాట్లాడుతూ జాతీయ నాయకుల జీవిత చరిత్రను, వారి స్ఫూర్తిని తెలియజేసే విదంగా ఏపీజేయూ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్మారక అవార్డులను రాష్ట్రంలో వివిధ సేవలు అందించిన వారిని గుర్తించి ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని సూచించారు. సభకు జ్ఞాని జైల్ సింగ్ జాతీయ స్మారక పురస్కారాల అధ్యక్షుడుగా అడవికొలను ట్రస్ట్ చైర్మన్ అడవికొలను వేణుగోపాల్ కృష్ణ సారధ్యం వహించగా కో ఆర్డినేటర్ గా ఏపీజేయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకట వేణు, కన్వీనర్ గా గాదంశెట్టి శేఖర్ బాబు లు అధ్యక్షత వహించారు. అత్యుత్తమ సేవలు అందించిన జర్నలిస్టులతో పాటు సేవా రంగంలో విశిష్ట సేవలు అందించిన సామాజిక సేవా కర్తలకు ముఖ్య అతిథి షరీఫ్ చేతుల మీదుగా శాలువాలు కప్పి జ్ఞాపిక, సిల్వర్ పతకాలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీజేయూ ఉపాధ్యక్షుడు తోట విష్ణు వర్ధన్, యం సూర్య భాస్కరరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు బొడ్డు కృష్ణ భగవాన్ ( ఆదరణ ట్రస్ట్), మనపాటి చక్రవర్తి (వినోద్ ఫౌండేషన్), శివకోటి శ్రీనివాసరావు ( గాయత్రి విశ్వకర్మ సమితి), గాదంశెట్టి సాయికృష్ణ సంపత్ కుమార్(వాలంటీర్) సుబ్బయ్యచారి, కుమార్ రాజా, సుధాకర్ (తిరుపతి పవర్), హేమసుందర్ ( గ్రేటర్ టుడే), గురుకాంతాచారి, తదితరులు ఉన్నారు.
Comments are closed.