The South9
The news is by your side.
after image

హీరో కార్తికేయ విలేజ్ డ్రామెడీ ‘బెదురులంక 2012

post top

హీరో కార్తికేయ విలేజ్ డ్రామెడీ ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి, విడుదలకి సిద్ధం!!

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా తెరకెక్కనున్న సినిమా ‘బెదురులంక 2012’.

క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు.

Post Inner vinod found

ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మార్చి లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం ‘వరల్డ్ అఫ్ బెదురులంక’ అని విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలని పెంచగా త్వరలో ఆసక్తికరమైన టీజర్ ని విడుదల చేయనున్నారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.

Post midle

Comments are closed.