The South9
The news is by your side.

నెల్లూరు పట్టణంలో స్వర్గీయ మంత్రి గౌతమ్ విగ్రహ ఆవిష్కరణ.

post top

 

 

తేదీ: 02-11-2023,

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.

*నెల్లూరు పట్టణంలో స్వర్గీయ మంత్రి గౌతమ్ విగ్రహ ఆవిష్కరణ*

*మంత్రిగా గౌతమ్ సేవలను స్మృతించుకున్న జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు*

*”ఏడీఎఫ్” ఆధ్వర్యంలో ఆత్మకూరులో మెగా జాబ్ మేళా నిర్వహణ*

 

*మేకపాటి గౌతమ్ రెడ్డి 52వ జయంతి సందర్భంగా ఘన నివాళి పలికిన అభిమానులు*

 

Post midle

*జాబ్ మేళా సద్వినియోగం కోసం భారీగా తరలివచ్చిన యువత*

 

after image

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నవంబర్, 02; స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 52వ జయంతి సందర్భంగా ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళాను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వెబ్ సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మెట్ట ప్రాంత యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలివ్వాలన్నది గౌతమ్ అన్న కలను నిజం చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం గౌతమ్ అన్న పుట్టినరోజు నాడు ఉద్యోగ మేళా నిర్వహిస్తామని విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో ఇప్పటిదాకా 2 జాబ్ మేళాలు నిర్వహించి వందలాది మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు అందించినట్లు పేర్కొన్నారు. దూరం, భారం అనేవి వదిలేసి రాజీపడకుండా కృషి చేస్తేనే ఉద్యోగం సాధ్యమవుతుందన్నారు. అవకాశం రావడం అంత సులభం కాదని..యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. 2 నెలలుగా క్షేత్రస్థాయిలో కసరత్తు చేసి జాబ్ మేళా నిర్వహణ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, నైపుణ్య రంగాలకు చెందిన 30 సంస్థలు జాబ్ మేళాలో భాగస్వామ్యమయ్యాయన్నారు. జాబ్ మేళా నిర్వహణపై ఫీడ్ బ్యాక్ తీసుకుని యువతకు ఎక్కడ ఇబ్బంది ఉందో గుర్తించి వారిని పరిశ్రమలకు తగినట్లు సన్నద్ధం చేసే చర్యలు చేపడతామన్నారు. 2 వేల ఉద్యోగాలిచ్చే జాబ్ మేళాను ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు, సహా జిల్లా స్థాయిలో జాబ్ మేళాలో నమోదైన యువత వివరాలన్నీ పరిశీలించి.. జాబ్ మేళా తర్వాత ఉద్యోగాలొచ్చినవారు,తృటిలో అవకాశం చేజారిన వారిని గుర్తించి మరో అవకాశం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. శిక్షణ అందించగలిగితే ఉద్యోగం సాధించే అవకాశాలున్న వారికి పరిశ్రమల ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.

*గౌతమ్ లాగే విక్రమ్..పని నిశ్శబ్దం..వ్యక్తిత్వం ప్రత్యేకం: మేకపాటి గౌతమ్ విగ్రహావిష్కరణలో మంత్రి కాకాణి*

 

నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. దివంగత మేకపాటి 52వ జయంతి సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అభిమానులు స్మృత్యంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి అరుదైన రాజకీయనాయకుడు గౌతమ్ దూరమైన నేపథ్యంలో 2 నిముషాలు మౌనం పాటించి నివాళి పలికారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..రాజకీయాల్లో ఉండి గౌతమ్ వేలెత్తి చూపకుండా చివరి శ్వాస వరకు రాజులా బతికారని అన్నారు. గుంబనంగా గుండె ధైర్యంతో ఉండే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..అత్యంత సన్నిహితుడు గౌతమ్ ని కోల్పోయిన రోజు ఎంతో బాధపడడం తాను చూశానన్నారు. మేకపాటి గౌతమ్ సంగం బారేజ్, వ్యవసాయ విశ్వావిద్యాలయం వంటి అభివృద్ధి కార్యక్రమాల రూపంలో గౌతమ్ ని నెల్లూరు జిల్లా గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. మేకపాటి గౌతమ్ లాగే మేకపాటి విక్రమ్ కూడా విభిన్న శైలి, మనస్తత్వం, పని తీరు అన్న లాగే నిశ్శబ్దంగా అనుకున్నవి చేస్తూ ముందుకెళుతున్నారన్నారు. గౌతమ్ లా..ప్రచారం తక్కువ పని ఎక్కువగా ఉండడం రాజకీయాల్లో అరుదైన విషమని కాకాణి స్పష్టం చేశారు.

 

*గౌతమ్ అన్న హామీలను నెరవేర్చడమే నా ఆశయం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

 

అనుకున్న నెల లోపే మేకపాటి గౌతమ్ అన్న విగ్రహ ఆవిష్కరణ శరవేగంగా పూర్తవడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ధన్యవాదాలు వెల్లడించారు. మేకపాటి కుటుంబ ప్రతిష్టను మరింత పెంచి..రాజకీయాలలో బెంచ్ మార్క్ గా గౌతమ్ అన్న నిలిచారన్నారు. రాజకీయాల్లో గౌతమ్ అన్న ఆశలు, ఆశయాలు చాలా నిస్వార్థమైనవన్నారు. వాటిని నెరవేర్చి ఆత్మకూరు ప్రజల రుణం తీర్చుకోవడమే తన ఏకైక లక్ష్యమన్నారు. గౌతమ్ అన్న.. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో ఆలస్యం జరగకూడదనే ‘ఏడిఎఫ్’ స్థాపించి ఆత్మకూరు బస్టాండ్ నిర్మించామన్నారు. ఆత్మకూరు ఎంఎస్ఎంఈ పార్కులో త్వరలో 10 పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి సభా సాక్షిగా ప్రకటించారు.

 

 

*పార్టీకి , ప్రభుత్వానికి చేసిన మంచి పనులు ఎన్నో ..ఎన్నెన్నో.. : కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి*

 

అధికారిక మంత్రి హోదాలో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ దివంగత మంత్రి మేకపాటి అభివృద్ధి, ఉపాధి కల్పించేందుకు ఎంతో కృషి చేశారని కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయని మానుగుంట అన్నారు. తన సొంత నియోజకవర్గంలోని రామాయపట్నం పోర్ట్ అభివృద్ధికి గౌతమ్ కృషి చేశారని మానుగుంట మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తాను వెనకుండి నన్ను ముందుండి నడిపించిన నిగర్వి మేకపాటి గౌతమ్ అన్న అంటూ ఎమ్మెలే అనిల్ యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. క్రమశిక్షణ, మంచి పెంపకంతో మర్యాదగా నడుచుకునే కుటుంబం మేకపాటి కుటుంబమంటూ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గౌతమ్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. మేకపాటి గౌతమ్ తో అనుబంధం అమూల్యం, ఆయన లేకపోవడం మెట్టప్రాంతంతో పాటు, సూళ్లూరుపేటకి లోటు అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు.

 

స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, కావలి నియోజకవర్గ ప్రతాప్ కుమార్ రెడ్డి, సూల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాదాసు గంగాధర్, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, ఆత్మకూరు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, ప్రజలు హాజరయ్యారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.