The South9
The news is by your side.

ముందుగానే వాటి గురించి ఆలోచించిన కన్నడ సూపర్ స్టార్ పునీత్.

post top

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించి రెండు వారాలైనా కన్నడ అభిమానులతోపాటు , తన గురించి తెలిసిన ప్రతి ఒక్క అభిమాని ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేదు. తాజాగా పునీత్ మరణానికి ముందు తను చేసిన గొప్ప విషయం ఇప్పుడు బయటికి రావడంతో అభిమానులు ఇంకా దుఃఖానికి లోనవుతున్నారు. పునీత్ నడుపుతున్న 45 స్కూల్స్ 16 ఓల్డ్ ఏజ్ హోమ్ లు, 26 అనాధ శరణాలు తో పాటు 19 గోశాలలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదని ముందుగానే వాటి అవసరాల నిమిత్తం ఎనిమిది కోట్ల రూపాయలు ఫిక్సడ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కూడా పునీత్ కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు తెలియలేదంటే తను సేవ పై ఎంత గొప్పగా ఆలోచించారొ అర్థమవుతుంది. మరణం తర్వాత కూడా మనుషుల మనసులను గెలిచిన పునీత్ నిజంగానే పునీతులయ్యారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.