The South9
The news is by your side.

కుమార్ స్వామి అక్రమ మైనింగ్ లో దోచుకుంటున్నాడు: సుమలత

post top

కర్ణాటక : ప్రముఖ నటి కర్ణాటక రాష్ట్రంలోని మాన్య నియోజకవర్గ ఎంపీ సుమలత అంబరీష్ జెడిఎస్ నేత కుమార్ స్వామి పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణ సాగర్ డ్యామ్ కి పగుళ్ళు వచ్చాయని దానిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న సుమలత వ్యాఖ్యలపై కుమారస్వామి డ్యాంకి అడ్డంగా సుమలత వెళ్లి పడుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సుమలత మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని, తన పట్ల చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తపరిచారు. ఇప్పుడు తాజాగా మరోసారి కుమారస్వామి పై సుమలత తీవ్రమైన ఆరోపణలు సంధించారు. మాండ్య జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుందని దీని ద్వారా కుమార్ స్వామి, జెడిఎస్ నేతలు బాగా లబ్ధి పొందుతున్నారని సుమలత అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి తనను వెళ్లనీయడం లేదని దీనిపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప, గనులు మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. చనిపోయిన తన భర్త అంబరీష్ పేరు పదే పదే ప్రస్తావించడం మంచి పద్ధతి కాదని సుమలత ఆవేశంగా అన్నారు. ఈ వ్యవహారం సుమలత వెర్సెస్ కుమార స్వామి అన్నట్టు సాగుతుండడంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.