The South9
The news is by your side.

మహేష్ సర్కారు వారి పాట కూడా సంక్రాంతికే!

post top

సినీ బ్యూరో :  కరోన కష్టకాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా విపత్కర పరిస్థితి ఎదుర్కుంది అనే చెప్పాలి. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ తర్వాత కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం, లాక్ డౌన్ పెట్టడంతో థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుంచి చాలా చిత్రాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేశారు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన నారప్ప చిత్రాన్ని కూడా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడంతో థియేటర్ల యజమానులు ఎగ్జిబిటర్లు కొంత ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో పూర్తి ఆక్యుపెన్సీ తో థియేటర్లు ఓపెన్ కాగా ఆంధ్రాలో మాత్రం 50% ఆక్యుపెన్సీ తో విడుదల చేసుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చాలా పెద్ద చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2022 సంక్రాంతికి పెద్ద సినిమాల తేదీలను ప్రకటించారు ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు. పవన్ కళ్యాణ్ , రానా నటిస్తున్న చిత్రం, అలానే వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఎఫ్3, ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యాం చిత్రాలని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట”చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సర్కారు వారి పాట చిత్రంలోని ఒక స్టిల్ రిలీజ్ చేస్తూ యాక్షన్ ఎంటర్ టైనర్ తో జనవరి 13న వస్తున్నట్లు ట్విట్ చేసారు. మొత్తానికి 2022 సంక్రాంతి పెద్ద సినిమాల సందడి తో మొదలు కానుంది.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.