The South9
The news is by your side.

సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించాం: సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

post top

అమరావతి : సినిమా పరిశ్రమకి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు, ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని నాని ని కలిసి పలు సమస్యలపై చర్చించారు. చర్చల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ…. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారని అవన్నీ నోట్ చేసుకున్నామని వాటి వివరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరికి తీసుకువెళతామని అన్నారు. గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించాలి అన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పష్టత ఇచ్చారు. ప్రజల సౌలభ్యం కొరకు టిక్కెట్లని ఆన్లైన్లో విక్రయిస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు బెనిఫిట్ షోలు గురించి ప్రస్తావించలేదని , వారికున్న సమస్యలను వివరించారని తెలిపారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.