The South9
The news is by your side.

మ‌హారాష్ట్ర‌లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఎన్డీఏ

post top

south 9 ప్రతినిధి :

after image
సరిగ్గా ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్రలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ముఖ్యంగా బీజేపీకి ఊహించని ప‌రాభ‌వం ఎదురయింది ఆ పార్టీ వ్యూహాలు పనిచేయలేదు 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 28 ఎంపీ సీటు గెలుచుకున్న కాషాయ పార్టీ ఈసారి కేవలం 13 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది ఫలితంగా లోక్సభలో బిజెపి సంఖ్యా బలాన్ని పరిమితం చేసింది ఉత్తరప్రదేశ్ త‌ర్వాత అత్య‌ధిక ఎంపీ  స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఎదురుగాలి  పర్యవసానంగా 2014 తరువాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం మిత్రపక్షాలపై కాషాయ పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే లోక్సభ ఎన్నికల ఎదురుదెబ్బ నుంచి నేర్చుకున్న పాఠం బిజెపి పట్టుదలగా ప‌నిచేసేలా  చేసింది వ్యూహాత్మ‌కంగా అడుగులు  వేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని రీతిలో సత్తా చాటింది అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 149 సీట్లు గెలుచుకుంది ఆ పార్టీ ప్రణాళికలు గ్రాండ్ సక్సెస్ అయినట్టు ఈ ఫలితాలు చాటి చెబుతున్నాయి లోపాలను స‌రిదిద్దుకోవ‌డంలో  నాయకత్వం 100% సఫలమైంది లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రాష్ట్రంలోని ఎన్డీఏ క‌స‌ర‌త్తులు చేసింది.  గిరిజ‌నులు, మ‌హిళ‌లు,  ఇతర వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంది పార్టీలోని అసంతృప్తుల‌ను శాంతింప‌జేసింది.  ఈ విషయంలో ప్ర‌తిపక్ష కూట‌మి  విఫలమైంది అభ్యర్థుల ఎంపికపై కూడా ఎన్డీఏ కూటమి చాలా శ్రద్ధ పెట్టింది అత్యుత్తమ అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా కూటమికి బాగా కలిసి వచ్చింది సైద్దాంతిక విభేదాలను సైతం సరిదిద్దుకొని ఆర్ఎస్ఎస్ ను శాంతింప  చేసుకుంటూనే అట్టడుగు స్థాయిలో ప్రచారం నిర్వహించడంలో బిజెపి విహాత్మకంగా వ్యవహరించింది
మ‌హారాష్ట్ర‌లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఎన్డీఏ

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.