The South9
The news is by your side.

మా నాన్నది ముమ్మాటికీ రాజకీయ హత్యే.. వైయస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి

post top

*మా నాన్నది రాజకీయ హత్యే: వివేకా కుమార్తె*
న్యూ ఢిల్లీ : తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు అవుతోందని.. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని పోరాడుతున్నట్లు చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ హత్య కేసు గురించి వదిలేయమని చాలా మంది సలహా ఇచ్చారని.. తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్‌ అని చెప్పారు.

after image

తప్పు జరిగిందని షర్మిలకు తెలుసు
‘‘ఇంకా ఎంతమంది సాక్షులు మరణించాక కేసు దర్యాప్తు పూర్తి అవుతుంది? మా నాన్న హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదు. మాజీ సీఎం సోదరుడు చనిపోతేనే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలి?’’ అని సునీత నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు. దర్యాప్తు త్వరగా పూర్తి అయ్యేలా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తప్పు జరిగిందని వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిలకు తెలుసని.. ఆమె తమకు అండగా ఉంటుందని సునీత చెప్పారు. విచారణ ఆలస్యమైతే సాక్షులకు హాని జరగొచ్చు
హైకోర్టులో వేసిన పిటిషన్‌లో నాకు అనుమానం ఉన్నవాళ్ల పేర్లు రాశాను. అనుమానితులు జాబితాలో ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహా పలువురు పేర్లను పిటిషన్ లో పేర్కొన్నాం. దర్యాప్తు వేగవంతంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం నాకు రాలేదు. సీబీఐ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి ఉందని నేను అనుకోవడం లేదు.. కానీ విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ సాక్షులకు హాని జరుగుతుందేమోననే భయం వేస్తోంది. ఆధారాలు కూడా దొరక్కుండా పోయే ప్రమాదముంది. న్యాయం కోసం సీఎం జగన్ సహా అవసరం అనుకున్న అందరి తలుపులూ తట్టాను. సీబీఐ విచారణతో న్యాయం జరగడం లేదనే మీడియా ముందుకొచ్చా. వీలైనంత త్వరగా నాకు న్యాయం జరిగేలా చేయాలి’’ అని సునీత కోరారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.