The South9
The news is by your side.

వాలంటీర్లపై విషం.

post top

*వాలంటీర్లపై విషం...*

*: పచ్చమీడియా పిచ్చి కధనాలు*

*: ప్రజాప్రతినిధులు, వారి సిబ్బందిని టార్గెట్ చేస్తున్న వైనం*

*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై పచ్చ మీడియా పిచ్చి పిచ్చి కధనాలు ప్రసారం చేయడమే కాక ప్రజాప్రతినిధులను, వారి సిబ్బందిని సైతం అనుసంధానిస్తూ వార్తలను చొప్పిస్తూ ప్రజల ఛీత్కారాలాను పొందుతున్నారు.*

 

after image

*ఇటివల మర్రిపాడు మండలం నాగినేనిగుంటకు చెందిన వాలంటీర్ అంబవరపు ఖాసీంపీరా ఓ మహిళ వద్ద అమ్మఒడి నగదు తస్కరించాడంటూ ఓ వర్గం మీడియా కధనాలను ప్రసారం చేసింది. ఆ ప్రసారంలో స్థానిక శాసనసభ్యుడితో పాటు ఆయన సిబ్బంది పేరును ప్రస్తావిస్తూ మరీ కధనం ప్రచారం చేసింది. స్పందించిన అధికారులు అసలు నిజనిజాలను తెలుసుకునేందుకు ఆ బాధిత మహిళను విచారించారు.*

*దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి, ఆ మహిళ అధికారులకు తెలిపిన వివరాల మేరకు అంబవరపు ఖాసీంపీరా అనే వాలంటీర్ గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ తమకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, అతనితో ఎలాంటి ఇబ్బంది లేదంటూ తెలిపారు. గ్రామానికి వచ్చిన సదరు వ్యక్తులు తమ చేత పథకం ప్రకారం ఇలా అమ్మఒడి నగదు కాజేశాడని మాట్లాడించారని, ఇందులో ఒక్క శాతం నిజం లేదని స్పష్టంగా తెలిపారు.*

 

Post midle

*శాసనసభ్యుని వద్ద పనిచేసే సిబ్బంది బంధువు కావడంతో ఆ వర్గం మీడియా ఇలా అసలు నిజం తెలుసుకోకుండానే ఇలాంటి కధనాలు ప్రసారం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని తామంతా కోరుతున్నామని గ్రామస్తులు సైతం అధికారులకు తెలిపారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.