టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టూ బోతున్నాడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని రూపొందబోతున్న టు తెలుస్తోంది. రామ్ చరణ్ కి 15వ చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హీరోగా ఆర్. ఆర్ .ఆర్. చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే, అలాగే శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు-2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ అనగానే అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన వార్త ఏమనగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రం లో ఒక పాత్రలో నటించే అవకాశం ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించాలని ఆశిద్దాం…
