స్వార్థంతో పార్టీలు వీడినా ప్రజలు వైఎస్ఆర్సిపి వైపే,ఖలీల్ గెలుపు పేదల గెలుపు :ఎమ్మెల్యే MA హఫీజ్ ఖాన్.

*మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కూటమి చూస్తోంది*
*సామాజిక పాలన జగన్ తోనే సాధ్యం*
*స్వార్థంతో పార్టీలు వీడినా ప్రజలు వైఎస్ఆర్సిపి వైపే*
*ఖలీల్ గెలుపు పేదల గెలుపు*
*అబద్దాలకోరు చంద్రబాబును ప్రజలు విశ్వసించరు*
*కర్నూలు ఎమ్మెల్యే MA హఫీజ్ ఖాన్*
2014లో పాదయాత్రలో 600 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఆరు కూడా అమలు చేయలేదని కర్నూలు ఎమ్మెల్యే MA హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు.

నగరంలోని మాగుంట లేఔట్ లో గల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి
ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నిరుద్యోగులను, మహిళలను, రైతులను మోసం చేసి గద్దెనెక్కాడున్నారు.
అబద్దాలకోరు చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు..
గత ప్రభుత్వంలో వందల కోట్లు చంద్రబాబుకు ముట్టజెప్పి దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని మంత్రి అయ్యారని నారాయణ ను విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందాలని నేరుగా లబ్ధి చెందాలని సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను అమలుచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది అన్నారు..
దళితుల కన్నా ఎక్కువ వెనకబడిన వారు ముస్లింలనీ గ్రహించి దివంగత నేత *వైఎస్ రాజశేఖర్ రెడ్డి* 4% రిజర్వేషన్ ఇచ్చాడు అన్నాడు..
ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలను రిజర్వేషన్ ను కాపాడుకుంటున్నారన్నారు..
ముస్లింల ఆస్తులపైన ముస్లింలు దుస్తులపైన మసీదుల పైన విద్వేషాలను రెచ్చగొట్టాలని బిజెపి చూస్తుందన్నారు..
అలాంటి పార్టీతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జతకట్టారని తెలిపారు..

కులం చూడకుండా మతం చూడకుండా నేరుగా సంక్షేపాలన అందించిన ఘనత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు..
ఏపీలో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి ఉంటే విద్వేషాలు రెచ్చగొట్టారని బిజెపి చూస్తుంటే వారితో పొత్తు ఎలా పెట్టుకుంటారని చంద్రబాబు నాయుడు ఏండ గట్టారు…
రాష్ట్రంలో కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు…
తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అజెండా అన్నారు..
చంద్రబాబు ముస్లిములను శాశ్వతంగా రాజకీయంగా సామాజికంగా అనగదొక్కాలని చూస్తున్నాడు అన్నారు..
టిడిపి లో నెల్లూరు రూరల్ లో ఇన్చార్జిగా ఉన్న అజీజ్ కు ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదని ప్రశ్నించారు..
ముస్లింలను మోసం చేయడం చంద్రబాబు నైజమైతే…
తమ నాయకుడు జగన్ ముస్లింలకు చట్టసభల్లో స్థానంతో పాటు చైర్మన్లు ఇతర పదవులు ఇచ్చి గౌరవించారన్నారు..
తమ నాయకుడు పేదల సంక్షేమ కోసం ఏడాదికి 70 వేల కోట్లు ఖర్చు చేస్తే మరో శ్రీలంక అన్న చంద్రబాబు నాయుడు ఏడాదికి 150వేల కోట్లు ఎలా మేనిఫెస్టో లో ప్రకటిస్తారన్నారు…
ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక రాజ్యసభ లో ముస్లింలకు స్థానం కల్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్నారు.
సామాన్యుడు అయిన ఖలీల్ అహ్మద్ కు నెల్లూరు సిటీ అభ్యర్థి గా సీటు ఇచ్చి ముస్లింలను గౌరవించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు..
తమ స్వార్థం కోసం పార్టీలు వీడుతున్న వారీ వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ప్రజలందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు…
దేవుని దయతో ప్రజల ఆశీర్వాదంతో *ఖలీల్ అహ్మద్* విజయం తద్యమన్నారు..
నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి తో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *క్లీన్ స్వీప్* చేయడం ఖాయమన్నారు..
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ఉద్యోగ కల్పన, సంక్షేమం, అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమైందన్నారు..
ఈ విషయంపై తనతో చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు..
…
Comments are closed.