The South9
The news is by your side.

చెప్పింది చేసి చూపించాం: ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

*చెప్పింది చేసి చూపించాం: ఎమ్మెల్యే మేకపాటి*

*ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతున్నాం*

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాలో నష్టపోయినా ప్రజలకు అందచేస్తామని చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించామని, ప్రజలకు చెప్పింది. చేసి చూపించామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సోమవారం గోగులపల్లిలో ఎన్నికల ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడారు.

after image

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన మెనిఫెస్టోతో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని, దీని ద్వారా రాష్ట్రం అనేక విభాగాల్లో టాప్-5 స్థానాల్లో నిలిచిందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం ప్రకటించిన మెనిఫెస్టోతో మరింత సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.

 

Post midle

దీని ద్వారా రాష్ట్రం మరెంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ హబ్ ఏర్పాటుతో పాటు నియోజకవర్గంలో ప్రజలు తెలిపిన అభివృద్ది పనులన్నింటిని పూర్తి చేస్తామని తెలిపారని, రానున్న రోజుల్లో వాటన్నింటిని పూర్తి చేస్తామని అన్నారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి 13 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారని అన్నారు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను పూర్తి చేసిన మా పార్టీకే ప్రజల మద్దతు ప్రతి గ్రామం నుండి లభిస్తుందని, తప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకున్న విధంగా 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, మళ్లీ సంక్షేమ ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.