The South9
The news is by your side.
after image

మార్పును చూసి ఆశీర్వదించండి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

వెంకట్రావుపల్లి, తేది : 23.01.2024*

మార్పును చూసి ఆశీర్వదించండి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: ప్రతి గ్రామానికి పూర్తిస్థాయి మౌళిక సదుపాయాలు*

*: పేదరికాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారు*

*: ప్రతి గ్రామాభివృద్దికి ప్రత్యేక మెనిఫెస్టో*

*:వెంకట్రావుపల్లిలో విజయీభవ యాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి*

 

గడప దాటకుండా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందించారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం, వాలంటీర్, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లీనిక్ లు ఏర్పాటు చేసి గ్రామ స్వపరిపాలనతో మార్పు శ్రీకారం చుట్టారని, గ్రామంలోనే సమస్యల పరిష్కారానికి గ్రామంలోనే ఏర్పాటు చేసిన ఇలాంటి వ్యవస్థలతో మార్పుకు శ్రీకారం చుట్టారని, అలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకునేందుకు ప్రజలు ఆశీర్వదించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటివిక్రమ్ రెడ్డి అన్నారు.

Post midle
Post Inner vinod found

ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు వెంకట్రావుపల్లిలో మంగళవారం విజయీభవయాత్రను కొనసాగించారు. వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ దీవించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయం, దర్గాలలో ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

అనంతరం వార్డుపరిధిలోని ప్రతి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఏమైనాసమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలంటూ ప్రజలను కోరుతూ యాత్రను కొనసాగించారు.

 

అనంతరం ప్రచారరధంపై నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, వారిని పేదరికం నుండి దూరం చేసే లక్ష్యంతో పనిచేశారని, ప్రతి గ్రామంలో స్వపరిపాలనకు నాందిపలుకుతూ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇబ్బందులను తొలగించారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్ లతో పాటు ప్రభుత్వ వైద్యశాలల్లో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు వైద్యం మరింత చేరువ చేశారని వివరించారు.

 

గత ప్రభుత్వం అమరావతి ఒక్క ప్రాంతాన్నే అభివృద్ది చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని మరిచిపోయారని, రైతుల వద్ద నుండి 30 వేల ఎకరాల భూములు తీసుకున్నారని, వారి పార్టీ నేతలే 10 వేల ఎకరాలు స్వంతంగా ఉంచుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకునేందుకు రూ.5లక్షలు కోట్లు అవసరమంటూ తిరిగారని అన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అనంతరం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ది చెందాలని, పేదరికం తగ్గు ముఖం పట్టాలనే ఉద్దేశ్యంతో పాలన సాగించారని, రూ.3లక్షల కోట్లను ప్రజలకు సంక్షేమ,అభివృద్ది పథకాల ద్వారా అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు.

 

తాను శాసనసభ్యునిగా ఎన్నికైన అనంతరం సచివాలయంలోనే సమస్య నమోదు పుస్తకాన్ని ఏర్పాటు చేసి సచివాలయం పరిధిలో సమస్యలను పరిష్కరించేలా చేశామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ముఖ్యమంత్రి అందచేస్తున్న సంక్షేమాన్ని వివరిండంతో పాటు ప్రజలు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరగిందన్నారు. దీని ద్వారా మరింత మంది సంక్షేమ పథకాలకు అర్హత సాధించారని పేర్కొన్నారు.

 

వెంకట్రావుపల్లి సచివాలయం పరిధిలో మౌళిక సదుపాయాల కల్పన కోసం రూ.40లక్షల వరకు నిధులు కేటాయించడం జరిగిందని, సీసీరోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఈ ప్రాంత ప్రజలు కోరిన మేరకు మిగిలి ఉన్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, శ్మశనానికి దారి తదితర వసతులు ఏర్పాటు చేస్తామని, ప్రతి ప్రాంతానికి మెనిఫెస్టోను ఏర్పాటు చేసి భవిష్యత్తులో చేసే పనులను మీకు చెప్పే చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు.

 

గడప దాటకుండా సంక్షేమాన్ని అందచేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న పాలన తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ప్రజలందరికి తెలుసునని, ఆ వ్యవస్థలు ప్రజలందరికి ఎంతటి సేవలందిస్తున్నాయని దేశమంతా తెలుసునన్నారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతుంటే ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని, వారు అధికారంలోకి వస్తే వీటన్నింటిని రద్దు చేసి మళ్లీ వాళ్ల పార్టీ నాయకుల ఇళ్లకు ప్రజలు పరిగెత్తే విధంగా చేస్తారని, ప్రజలే ఆలోచించి సంక్షేమ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు.

Post midle

Comments are closed.