The South9
The news is by your side.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరీ-2022″బిగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన “మా” అధ్యక్షుడు మంచు విష్ణు !!

post top

సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరీ-2022″బిగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన “మా” అధ్యక్షుడు మంచు విష్ణు !!

ద సౌత్ 9 డిజిటల్ మరియు ప్రింట్ మేగజైన్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరీ-2022 భారీ స్థాయిలో రిచ్ క్వాలిటీ తో రాబోతుంది.. మ్యాగజైన్ ఎడిటర్ మరియు పబ్లిషర్ అయిన మనపాటి చక్రవర్తి ఈ డైరీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ ఇన్ఫర్మేష న్ ను జోడించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరీని తీసుకొస్తున్నారు .. ఈ డైరికి సంభందించిన బ్రోచెర్ ను మా అధ్యక్షుడు విష్ణు మంచు డిసెంబర్ 9న హైదరాబాద్ లోని తన కార్యాలయంలో లాంచ్ చేసారు.. దక్షిణాదికి చెందిన నాలుగు భాషల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరీని తీసుకురావడం చాలా మంచి విషయం.. అని ద సౌత్ 9 యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ద సౌత్ 9 ఎడిటర్ అండ్ పబ్లిషర్ మనపాటి చక్రవర్తి, సౌత్ 9 విజయవాడ హెడ్ రాజు, అరుణ్ పాల్గొన్నారు.. జనవరిలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరీ మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది.. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన క్వాలిటీతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమగ్ర సమాచారంతో ఈ డైరీని డిజైన్ చేసి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో తీసుకొస్తున్నాం.. అని మనపాటి చక్రవర్తి అన్నారు. సౌత్ 9 ఎడిటర్ మనపాటి చక్రవర్తి మాట్లాడుతూ…. మా ఈ బిగ్ పోస్టర్ లాంచ్ కి పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు మా అధ్యక్షులు మంచు విష్ణు కి మా  సౌత్ 9 టీం తరఫున  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. అలానే ఈ డైరీ విషయంలో అడుగడుగున సహాయ సహకారాలు అందిస్తున్న మా గురువు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.

after image

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.