The South9
The news is by your side.

8 ఏళ్ల తరవాత స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం : మంత్రి విశ్వరూప్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం
* ప్రతి జిల్లాలోనూ స్పెషల్ కోర్టుల ఏర్పాటు
* రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్
* 8 ఏళ్ల తరవాత స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం : మంత్రి విశ్వరూప్
* ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధికి ఈ సమావేశం నిదర్శనం
* కలెక్టర్లు, ఎస్పీలు వారానికి ఒకసారి ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించాలన్న సీఎం జగన్
* తమ ప్రభుత్వ హయాంలో అట్రాసిటీ కేసుల దర్యాప్తులో పెరిగిన పురోగతి : హోం మంత్రి సుచరిత
* అత్యాచార బాధితులకు ఉద్యోగాల కల్పన : మంత్రి ఆదిమూలపు సురేష్
సచివాలయం, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయానికి ప్రతి జిల్లాలోనూ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో వారానికి ఒకసారి ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. తలెత్తుకునే జీవించేలా ఎస్సీ, ఎస్టీలకు హక్కులు క్పలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం హయాంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుల దర్యాప్తులో మంచి పురోగతి సాధించామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశ వివరాలను సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు వెల్లడించారు.
ముందుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు జరిగిందన్నారు. 2013 తరవాత స్టేట్ లెవెల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ సమావేశ నిర్వహణ ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదై పెండింగ్ లో ఉన్న కేసులపై సీఎం జగన్ సమీక్షించారన్నారు. కరోనా కారణంగా గతేడాది మార్చిలో జరగాల్సిన సమావేశం ఇపుడు నిర్వహించామన్నారు. జిల్లాలో ఇకపై ప్రతి 3 నెలలకోసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలు, 6 నెలకొకసారి రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేశారన్నారు. అట్రాసిటీ చట్టం కింద రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కేసులను గుర్తించి, బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఆయా ఘటనలో బాధితులకు అందించాల్సిన భూములు, ఉద్యోగం, ఆర్థిక సాయం పంపిణీ కూడా సత్వరం చేపట్టాలన్నారు. భూములు లేనిచోట్ల కొనుగోలు చేసి, బాధితులకు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయానికి ప్రతి జిల్లాలోనూ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థ్రైర్యం పెరిగేలా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వారంలో ఒకసారి ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ప్రతి జిల్లాల్లోనూ జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలు సక్రమంగా నిర్వహించే బాధ్యతలను తనకు, హోం మంత్రి మేకతోటి సుచరితకు, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలకు అడ్డుకట్టవేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. నిందితుల్లో పోలీసులున్నా జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సాయంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సాయమందించామన్నారు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన తూర్పుగోదావరిలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు. ఆ సమావేశంలో 34 మంది బాధితులకు ఉద్యోగాలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇదే మాదిరిగా మిగిలిన జిల్లాల్లోనూ బాధితులకు ఉద్యోగాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. హత్యకు గురైన 22 ఏళ్ల ఎం.స్నేహలత కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుందన్నారు. రూ.4.12 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందజేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులకు శిక్ష పడేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.
50 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి… : హోం మంత్రి సుచరిత
గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుల దర్యాప్తులు నత్తనడకగా సాగేవిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. తమ ప్రభుత్వం హయాంలో 60 రోజుల్లోనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే సగటున 50 రోజుల్లోనే కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. బాపట్ల, కాశీబుగ్గ…తదితర కేసుల్లో పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్సీల అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో పోలీసులున్నా ఉపేక్షించలేదన్నారు. గతంలో నమోదైన కేసుల్లో 3.6 శాతం మేర దర్యాప్తులు పూర్తయ్యేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 7.1 శాతానికి పెరిగిందన్నారు. దర్యాప్తు ముగింపు శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల్లో త్వరితగతిన పరిష్కారానికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని సీఎం జగన్ సూచించారన్నారు. ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’ పోలీస్‌ శాఖ రూపొందించిన బుక్‌ లెట్‌ను ప్రతి కానిస్టేబుల్ కు అందిస్తున్నామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ లను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఆ ల్యాబ్ ల్లో అవసరమైన మరో 66 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే సమావేశంలో ఈ ఆరు నెలల కాలంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులో తీసుకున్న పురోగతిపై చర్చిస్తామని మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
అత్యాచార బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం… : మంత్రి ఆదిమూలపు సురేష్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హత్యతో పాటు మానభంగానికి గురైన ఎస్సీ, ఎస్టీ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మానవ హక్కుల సంఘ సభ్యులు, అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ కొనియాడారన్నారు. ఏపీ ఇతర రాష్ట్రాలకు ప్రశంసించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారన్నారు. బాధితులకు ప్రభుత్వం అందించే సాయంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా సాయం అందించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి ఈ ఆర్థిక సాయం నిదర్శమని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తనతో పాటు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చిన నివేదికలను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ఎస్సీ, ఎస్టీల్లో భరోసా కల్పిస్తున్నాయని కొనియాడారు.

Post midle

Leave A Reply

Your email address will not be published.