
తేదీ: 10–06–2023*
స్థలం: తాడేపల్లి*
అమీ – తుమీ…!*
*ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఆరోపణల్ని తిప్పి కొట్టిన వై సి పీ మంత్రులు*
*మంత్రి అమర్నాథ్: టీడీపీ తప్పా, రాష్ట్రమంతా వెలుగులోనే ఉంది*

తానూ ప్రభత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసిందేమి లేకపోగా అన్ని రంగాల్లోని ప్రజలకు అన్యాయం చేసారు అంటూ చంద్రబాబుని విమర్శించారు వై ఎస్సార్ సీపీ నాయకులు. నిన్న చంద్రబాబు పలు మంత్రులని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ఆరోపించడాన్ని తప్పు పడుతూ జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు టీడీపీ హయాంలో జరిగాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు
దేశంలో అగ్రగామిగా నిలుస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేస్తుంటే, మోసగాడు బాబు మరియు టీడీపీ ఇంకా చీకటిలో బ్రతుకుతున్నారు అని విమర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం 245 ఇండస్ట్రియల్ పార్కులు, 31 MSME పార్కులు స్థాపించడాన్ని గుర్తించాలని అన్నారు

ఏపీలో కొత్త లిక్కర్ బ్రాండ్‌లకు అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం అని…అధికారంలో ఉన్నన్ని రోజులు మద్యాన్ని ఏరులై పారించి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడం వల్ల ప్రజల ఆరోగ్యాలు నాశనమవడంతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగింది మీ ప్రభుత్వంలో అంటూ స్పందించారు డెప్యూటీ సీఎం నారాయణ స్వామి
*ఫేక్ ప్రచారం మానుకోవాలి*
అసలు చంద్రబాబు హయాంలో టూరిజం శాఖ ఒకటి ఉండేదని కానీ, టూరిజం మంత్రి ఉండేవారని కానీ ప్రజలకు తెలియనట్లు ఉండేది కానీ మా సీఎం జగన్ గారి ప్రభుత్వంలో ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గ్లోబల్ ఇన్వెస్టర్స్‌సమ్మిట్‌లో టూరిజం రంగంలో రూ.22,096 కోట్ల విలువైన 117 ఎంఓయూలు జరిగాయి. ఫేక్ ప్రచారాలు ఇప్పుడైనా మానుకోవాలని హితవు పలికారు
ప్రజలు రేషన్ సరుకుల కోసం ఇబ్బంది పడకుండా వారికి ఇంటి వద్దే అందించేలా 9,300 మినీ ట్రక్కులను కొనుగోలు చేశాం. రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నాం. ఇలాంటివి మీ చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా ప్రజలు చూశారా? అని ప్రశ్నించారు మంత్రి కార్మూరి నాగేశ్వర్ రావు
Comments are closed.