The South9
The news is by your side.

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన నివాళి.

post top

*దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన నివాళి*

*: బ్రాహ్మణపల్లిలో ప్రధమ వర్థంతి వేడుకలు

 

*దివంగత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా వారి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.

 

after image

*బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో వారి స్వగృహంలో ఏర్పాట్లను దగ్గరుండి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మరియు వారి కుమారుడు ఆత్మకూరు ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యవేక్షించారు.*

 

*రెండు రోజుల నుండి గ్రామంలోని ఉండి వర్ధంతి నివాళి కొరకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు గృహం వద్ద పదివేల మందికి భోజనం వసతులు ఏర్పాటు చేశారు. ఇంటి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మేకపాటి గౌతంరెడ్డి చిత్రపటానికి గ్రామస్తులు అభిమానులు శోకసముద్రంతో నివాళులర్పించారు.*

 

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మాత్యులు కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఇన్చార్జ్ బాలిలేని శ్రీనివాస్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకులు గురు మోహన్, నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి ప్రజాప్రతినిధులు మేకపాటి అభిమానులు పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు.*

 

*ఈ సందర్భంగా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.