The South9
The news is by your side.

నేనెవరు విడుదల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాం

after image

*నేనెవరు* విడుదల కోసం

ఆత్రంగా ఎదురు చూస్తున్నాం!!

– హీరోహీరోయిన్లు

కోలా బాలకృష్ణ – సాక్షి చౌదరి

– *ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్*

Post Inner vinod found

*డిసెంబర్ 2న బ్రహ్మాండమైన విడుదల*

 

“నేనెవరు” చిత్రం విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు ఈ చిత్ర హీరో-హీరోయిన్లు కోలా బాలకృష్ణ – సాక్షి చౌదరి. ఈ చిత్రం అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు ఎంత తపన పడ్డారో తాము ప్రత్యక్షంగా చూశామని, దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారని వారు తెలిపారు. ఈ చిత్రం తన తండ్రి (కోలా భాస్కర్) ఎడిటింగ్ చేసిన ఆఖరి చిత్రం కావడం వలన తాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని కోలా బాలకృష్ణ అన్నారు. “నేనెవరు” చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ, ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు చాలా మంచి పేరు తెస్తుందని సాక్షి చౌదరి పేర్కొన్నారు.

Post midle

ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ మరియు ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడం… “నేనెవరు” చిత్రం సాధించబోయే ఘన విజయానికి సంకేతంగా భావిస్తున్నామని అన్నారు.

నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన “నేనెవరు” డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధగోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం “నేనెవరు” కావడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!

Post midle

Comments are closed.