*జగనన్న పాలనలో పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: ప్రజాసంక్షేమం, అభివృద్దికి సమాన ప్రాధాన్యత*
*: జగనన్నకు అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది*
*: అక్బరాబాద్, గుంపర్లపాడులలో సంక్షేమాభివృద్దికి రూ.19.85 కోట్లు*
*: అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి*
: రెవెన్యూ సంస్కరణలతో 243 మంది రైతులకు లబ్ది
ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ప్రతి హామి, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చి పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అలాంటి ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
విజయీభవయాత్రలో భాగంగా ఆదివారం ఏఎస్ పేట మండలంలోని అక్బరాబాద్, గుంపర్లపాడులలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్బరాబాద్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల ద్వారా రూ.17.50లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లనిర్మాణాలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ముమ్మరంగా పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి ప్రజలను స్వయంగా కలిసి మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయాలంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ విజయీభవయాత్రను కొనసాగించారు.
అనంతరం ప్రచారరధంపై నుంచి విజయీభవయాత్ర కొనసాగించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ది చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరికి అండగా నిలిచారన్నారు. అలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, ప్రజలంతా దానికి సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రజాసంక్షేమానికి, అభివృద్దికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న కాలంలో సంక్షేమాభివృద్దిని మరింతగా ప్రజలకు అందచేస్తారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో అక్బరాబాదు పంచాయతీ డిబిటి, నాన్ డిబిటి ద్వారా మొత్తం రూ.6.87 కోట్ల సంక్షేమాభివృద్దికి అందచేశారని అన్నారు.
ఈ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.17.5 లక్షలు, ఎన్ఆర్ఈజీయస్ ద్వారా రూ.25లక్షలు, జలకళ ద్వారా ఏడు బోర్ల ఏర్పాటుతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవాలయ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
అనంతరం గుంపర్లపాడులో సాగిన విజయీభవయాత్రలో ఎమ్మెల్యే మేకపాటి అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ లతో పాటు గ్రామంలో ఇటీవల నిర్మించిన సైడ్ కాలువల నిర్మాణాలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి, అభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధఆన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. గుంపర్లపాడు గ్రామాన్ని నాలుగేళ్లలో శాశ్వత అభివృద్ది భవనాలు, ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అభివృద్ది చేయడం జరిగిందని వివరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో అక్బరాబాదు, గుంపర్లపాడు గ్రామాలలో 243 మంది రైతులకు లబ్ది చేకూరిందని వివరించారు. గుంపర్లపాడుకు రూ.40 లక్షలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అభివృద్ది నిధులను అందచేశామని, సంక్షేమాభివృద్ది కోసం రూ.12.99 కోట్లు నిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేసినట్లు వివరింఛారు.
స్వంతింటి కలను నిజం చేసేందుకు 110 మంది లబ్దిదారులకు రూ.2.70 కోట్లు, స్వంతస్థలం కలిగిన 10 మందికి రూ.10లక్షలు నిధులు అందచేయడం జరిగిందని అన్నారు. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా 17 బోర్లు మంజూరు చేశామని, వివరించారు.
ఐదేళ్లు అవకాశమిస్తే ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ది చేసి పేదరికాన్ని తగ్గుముఖం పట్టించారని, అదే సంక్షేమ పాలన మళ్లీ కొనసాగితే ప్రజలందరూ ఆర్థిక స్థితిమంతులు అవుతారని, రాష్ట్రం అన్ని రంగాల్లో నెం.1గా నిలుస్తుందని, ప్రజలంతా ముఖ్యమంత్రి జగనన్ను ఆశీర్వదించి ఆయన కోరుకున్న విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా ఆశీర్వదించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
Comments are closed.