The South9
The news is by your side.

బోయపాటి ఊహను నిజం చేస్తాడా..!

post top

సౌత్ 9 ప్రతినిధి :

after image

చిరంజీవి బాలకృష్ణ…. వీరిద్దరూ గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ రంగాన్నిఏలుతున్నారు ప్రస్తుతం కూడా టాప్ స్టార్స్ లో వీరిద్దరూ ప్రముఖ స్థానంలో కనిపిస్తారు ఇద్ద‌రు మాస్ హీరోలే అయితే మాస్ సినిమాలతో పాటు విభిన్న చిత్రాల లలో నటించారు త‌మ‌ ఇమేజి కి సరిపడ‌ని పాత్రలో కూడా చేశారు చేసి మెప్పించారు ఇప్పటికీ మెప్పిస్తూనే ఉన్నారు తమ వారసులు హీరోలుగా చలామణి అవుతున్న రోజుల్లో కూడా వీరిద్దరూ ఇంకా టాప్ స్టార్స్‌గానే నిలబడి ఉన్నారు ఇటీవల బాలకృష్ణ నటుడిగా50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను బాలకృష్ణ తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని వ్యాఖ్యానించారు తమ ఇద్దరినీ పెట్టి సినిమా తీయాలని దర్శకుడు బోయపాటికి కూడా చిరంజీవి సవాల్ విసిరారు. ఈ అంశంపై తాజాగా బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్య వ్యాఖ్యలు చేశారు చిరు బాలయ్యలను ఎదురుగా పెట్టుకుని వారి కోసం క‌థ రాయకపోతే వేస్ట్ అని అన్నారు ఆ సినిమాకు టైటిల్ కూడా వారిద్దరేనని చెప్పారు బోయపాటి వ్యాఖ్యలు చూస్తుంటే కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ చిత్రం కోసం మెగా నందమూరి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్‌ సినిమాలో క‌లిసి న‌టించి మ‌ల్టీస్టార‌ర్‌గా మెప్పించారు. ఇప్పుడు చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌ వంతు వచ్చింది మరి వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కావ‌డం ఖాయం అని అనుకోవచ్చు ఇలాంటి టాప్ స్టార్స్‌ నటించిన చిత్రాలు బాలీవుడ్ లో వస్తూ ఉంటాయి తెలుగులో కూడా ఇది సాకారం అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.