సౌత్ 9 ప్రతినిధి :
ప్రియాంకాగాంధీపై ఖుష్బూ పోటీ....!
మెల్ల మెల్లగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నారు బిజెపి కి పోటీ ఇచ్చే స్థాయిలో తన పార్టీని సమాయత్తం చేస్తున్నారు అలా కాంగ్రెస్ కు కేరళలోని వాయనాడు లోక్‌సభ నియోజకవర్గం కంచుకోటగా మారింది ఈ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఈసారి తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారు 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటు కేరళలోని వాయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలినుంచి కూడా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు ఈ క్రమంలో వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఇక్కడ ఆయన రెండు సార్లు ఘన విజయం సాధించారు 2019లో కూడా సిపిఐ అభ్యర్థి పై దాదాపు నాలుగు లక్షల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు 24 లో సిపిఐ అభ్యర్థి ఏని రాజా పై మూడున్నర లక్ష మెజార్టీతో గెలిచారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఈనియోజకవర్గం కంచుకోటగా మారింది ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ప్రియాంక గాంధీ పై ప్రముఖ నటి కుష్బూ సుందర్నో పోటీకి దింపే ఆలోచన బిజెపి చేస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి దీనిపై ఆమె స్పందిస్తూ ఎన్నికలవేళ ఇలాంటివి పుకార్లు మామూలే ఇది నిజం కాదు అని స్పష్టం చేశారు కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ప్రియాంక గాంధీ పై పోటీ చేయడానికి సిద్ధమేనని కుష్బూ తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పై పోటీ చేస్తే ఎవరు విజయం సాధిస్తారో ఎవరిది పై చేయి అవుతుందో అనే ఆసక్తి మొదలైంది మొత్తానికి వచ్చే ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి
Comments are closed.