The South9
The news is by your side.

జిల్లా పోలీసుల వేగవంతమైన చర్య – నిందితులు అదుపులో

post top

నెల్లూరు జిల్లా పోలీసుల బులెటిన్ – హౌస్ బర్గలరీ కేసు ఛేదన, ప్రజలకు భద్రత సూచనలు

నెల్లూరు, ఏప్రిల్ 14

SPSR నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల హౌస్ బర్గలరీ కేసు వివరాలను వెల్లడించారు. టౌన్ ASP దీక్ష సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో, నెల్లూరు టౌన్ వేదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న చోరీ కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు.

అంతరాష్ట్ర గజదొంగను అరెస్ట్ చేసి, సుమారు రూ.17 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ కీలక పాత్ర పోషించిందని, నిందితుడి కదలికలను గుర్తించడంలో ఇది సహాయపడిందని వివరించారు.

కిడ్స్ సేఫ్టీపై సూచనలు

వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, కాలువలు, నీటి కుంటల దగ్గర ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యవేక్షణ లేకుండా బయటకు పంపకూడదని, ప్రమాదకర ప్రదేశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. బీచ్ ప్రాంతాల్లో అండర్ వాటర్ కరెంట్స్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రోడ్ సేఫ్టీ చర్యలు

Post midle
after image

గత క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్వార్టర్‌లో రోడ్డు ప్రమాదాలు 20% తగ్గినట్లు వెల్లడించారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీస్, RTA, ఫైర్ శాఖలతో కలిసి 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని, మైనర్లు డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. మర్రిపాడు–DC పల్లి ప్రాంతాల్లో పశువుల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సైబర్ సేఫ్టీ అవగాహన

ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్కామ్ కాల్స్, OTP మోసాలు, ఆన్లైన్ జాబ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిల్లల మొబైల్, ఇంటర్నెట్ వినియోగంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ అవసరమని సూచించారు. అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్, సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

ప్రజలకు సూచనలు

అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 లేదా 9392903413 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే నేర నియంత్రణ సాధ్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కిడ్స్ సేఫ్టీ మరియు LHMS అవగాహన పోస్టర్లను మీడియా సమక్షంలో ఆవిష్కరించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.