జగన్ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాడు..
. వైసీపీ హయాంలో ఇసుక మద్యం దోపిడి..
చంద్రబాబు పాలనలో ఇసుక సీన రేజ్ రద్దు….. చంద్రబాబు నిద్రాహారాలు మాని వరద బాధితులకు సహాయ చర్యలు....
పల్లె పండుగతో గ్రామాల అభివృద్ధి….
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్….
అమరావతి
అక్టోబర్ 19
రాష్ట్రంలో వైసిపి హయాంలో ఇసుక మద్యం ను వైసీపీ నేతలు దోపిడీ చేశారని లారీ ఇసుక 40 వేలకు అమ్మి ప్రజల సొమ్మును దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్లరమేష్ దుయ్యబట్టారు అమరావతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం కి వచ్చాక ఇసుకను ప్రజలకు స్వేచ్ఛగా అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని, ఇసుక పై చంద్రబాబు సీన్ రేస్ రద్దు చేయడం హర్షనీయమని, ఆయన అన్నారు రాష్ట్రంలో ఇసుక మద్యం జోలికి వెళ్లవద్దని చంద్రబాబు చెప్పటాన్ని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు గత ఐదేళ్ల గా ఏమాత్రం పట్టించుకోలేదని సర్వ నాశనం చేశారని రైతులను పోలీసులతో కొట్టించి అక్రమ కేసులు పెట్టారని ఆయన విమర్శించారు అమరావతిలో రోడ్లను త్రవ్వి మట్టిని దొంగలించారని ఆయన విమర్శించారు తమ ఓటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు చొరవ తీసుకుని రైతులకు కవులు ఇస్తున్నారని అమరావతి రాజధాని పనులు అతివేగంగా పూర్తిచేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు అమరావతి రైతులకు చంద్రబాబు అండగా నిలిచారని ఆయన తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి బాటలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఆయన అన్నారు జగన్ పాలనలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు జగన్ ఐదేళ్లలో మాఫియాలను ప్రోత్సహించారని రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చాడని ఆయన విమర్శించారు వరద బాధితులకు సహాయం అందించడంలో చంద్రబాబు పది రోజులు నిద్ర హారాలు మాని బాధితులకు సహాయ అందేలా సహాయ చర్యల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు వరద బాధితులకు జగన్ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా కోటి రూపాయలు ఇచ్చానని చెప్పటం దుర్మార్గమన్నారు కోటి రూపాయలు ఎక్కడా ?ఎవరికిచ్చారో జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తమ ప్రభుత్వంపై వైసిపి విష ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు వరదల్లో కొవ్వొత్తులకు అగ్గిపెట్టెలకు 23 కోట్లు ఖర్చు అయిందని కుటమి ప్రభుత్వం పై వైసీపీ విష ప్రచారం చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు, వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో పల్లె పండుగ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నాలుగు ఐదు వందల కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు
Comments are closed.